Krunal Pandya record figures of 4/36 during the third and final T20I in Sydney. It was also his personal best figures in the T20Is. The left-arm spinner bagged 4 wickets for 36 runs as India's levelled the series. Krunal Pandya, while featuring in only his sixth T20I for India recorded the best bowling figure by a spinner in Australia.
#IndiavsAustralia
#dhawan
#viratkohli
#KrunalPandya
#rohitsharma
మూడు టీ20ల సిరిస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. సిడ్నీ వేదికగా ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో టీ20లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాగా, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌తో అంతర్జాతీయ టీ20ల్లో ఆరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా ఆసీస్ గడ్డపై రెండు అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. అందులో ఒకటి అరుదైన రికార్డు కాగా, మరొకటి చెత్త రికార్డు కావడం విశేషం. బ్రిస్బేన్ వేదికగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్లు వేసిన కృనాల్ ఒక్క వికెట్ కూడా తీయకుండా ఏకంగా 55 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో కృనాల్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న భారత స్పిన్నర్‌గా చెత్త రికార్డును మూట గట్టుకున్నాడు.